కెరీర్ మొదట్లో ధోనీతో మాట్లాడేవాడిని కాదు : ఇషాంత్

1224
Indian Pacer Ishant Opens Up On Camaraderie With Dhoni Over The Years
Indian Pacer Ishant Opens Up On Camaraderie With Dhoni Over The Years

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఔనత్వాన్ని అర్థం చేసుకోవడానికి తనకు ఆరేళ్ళు పట్టిందని ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నారు. 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో టీమిండియలోకి అడుగు పెట్టిన ఇషాంత్.. కెరీర్ మొదట్లో ధోనీతో పెద్దగా మాట్లాడేవాడు కాదట. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో యువ క్రికెటర్లతో ధోనీ వ్యవహరిస్తున్న తీరుకి తాను ఫిదా అయిపోయినట్లు ఇషాంత్ వెల్లడించాడు.

ఆ తర్వాత ధోనీని అర్థం చేసుకోవడం తాను ప్రారంభించానని ఇషాంత్ శర్మ వివరించాడు. స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో ఉన్న సాన్నిహిత్యం గురించి ఇషాంత్ శర్మ మాట్లాడుతూ..”జట్టులోకి వచ్చిన మొదట్లో ధోనీతో నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ 2013 తర్వాత అతనితో నెమ్మదిగా మాట్లాడుతూ వచ్చాను. ఈ క్రమంలో అతన్ని అర్దం చేసుకున్నాను. యువ క్రికెటర్లతో ధోనీ చక్కగా మాట్లాడతాడు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా వారితో అలానే కూల్‌గా అతను వ్యవహరిస్తాడు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? నా రూముకి రావొద్దు అని ధోనీ ఎవరితోనూ చెప్పడు. బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువగా ధోనీ రూముకి వెళ్తుంటాడు. ధోనీతో మాట్లాడితే క్రికెట్ గురించే కాదు.. జీవితం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు’’ అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు. భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లాడిన ఇషాంత్ శర్మ.. మొత్తం 420 వికెట్లు పడగొట్టాడు.

ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడు : హస్సీ

రోహిత్ శర్మకి ఆసీస్ బౌలర్లతో సవాల్ తప్పదు : హస్సీ

బుమ్రా నోబాల్‌ కారణంగా పాక్ తో భారత్‌ ఓడిపోయింది : భువనేశ్వర్

గంభీర్, కోహ్లీ గొడవ గురించి చెప్పిన రజత్ భాటియా

Loading...