Saturday, April 27, 2024
- Advertisement -

ఐపీఎల్ రేసునుంచి బెంగులూరు ఔట్‌…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమితో ముగించింది. దీంతో ప్లే ఆఫ్ రేస్‌నుంచి త‌ప్పుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు జట్టు.. స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ (4/16) ధాటికి 19.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆరు విజయాలకే పరిమితమైన ఆర్సీబీ ఇంటిదారి పట్టింది.

తొలుత ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (80 నాటౌట్: 58 బంతుల్లో 5×4, 3×6) అర్ధశతకం బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ల‌క్ష్య ఛేద‌న‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆర్సీబీ ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్‌(53), పార్థీవ్‌ పటేల్‌(33)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కోహ్లి(4), మొయిన్‌ అలీ(1), మన్‌దీప్‌ సింగ్‌(3), గ్రాండ్‌ హోమ్‌(2), సర్ఫరాజ్‌ ఖాన్‌(7)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు.

ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లి (4) ఔటవగా.. మిడిల్ ఓవర్లలో మొయిన్ అలీ (1), మన్‌దీప్ సింగ్ (3), గ్రాండ్ హోమ్ (2), సర్ఫరాజ్ ఖాన్ (7) పేలవ రీతిలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో.. టోర్నీలో 8వ ఓటమిని చవిచూసిన బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. ఏడో విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రేసులోనే కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -