Friday, April 26, 2024
- Advertisement -

చివ‌రి ఓవ‌ర్‌పై స్పందించిన రోహిత్‌….

- Advertisement -

ఉత్కంఠ‌గా సాగిన ఐపీఎల్ 2019 ఫైన‌ల్ పోరులో రోహిత్ సేన విజ‌యం సాధించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. దీంతో నాలుగోసారి క‌ప్‌ను సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో కీరన్ పొలార్డ్ (41 నాటౌట్: 25 బంతుల్లో 3×4, 3×6), ఓపెనర్ డికాక్ (29: 17 బంతుల్లో 4×6) నిలకడగా ఆడటంతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన ముంబయి టీమ్. అనంత‌రం 150 ప‌రుగుల‌క్ష్య‌చేద‌న‌కు దిగిన చెన్నై 148/7కే పరిమితం చేసింది. ఆ జట్టులో ఓపెనర్ షేన్ వాట్సన్ (80: 59 బంతుల్లో 8×4, 4×6) భారీ ఇన్నింగ్స్ ఆడినా.. ఆఖరి ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవడంతో ముంబయికి మ్యాచ్‌పై పట్టుచిక్కింది.

ఇద‌లా ఉంటె చివ‌రి ఓవ‌ర్‌పై స్పందించారు ముంబ‌య్ కెప్టెన్ రోహిత్ . క‌ప్ నాలుగో సారి గెల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో వెటరన్‌ బౌలర్‌ మలింగనే చాంపియన్‌ అంటూ పేర్కొన్నాడు. బౌల‌ర్లు అంద‌రూ చ‌క్క‌గా రాణించార‌న్నారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే. మలింగ తన మూడో ఓవర్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యాతో వేయిద్దాం అనుకున్నాం. కాని చివ‌ర‌లో బౌలింగ్ ఎలా వేయాలో మాలింగ‌కు తెలుసున‌ని అందుకే ఆత‌నివైపు మొగ్గు చూపామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -