Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీకి మరో సరికొత్త రికార్డు..!

- Advertisement -

క్రికెట్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎవరికి అందకుండా దూసుకెళ్తున్నాడు. ఫార్మాట్ ఏదైన సరే రెచ్చిపోయి తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సాధించాడు. తాజాగా శుక్రవారం పూణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని సాధించారు.

అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెఫ్టెన్ గా సరికొత్త రికార్డుని తన ఖాతలో వేసుకున్నాడు. కెప్టెన్గా 169 మ్యాచ్ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. కెప్టెన్గా 11వేలు అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్) ధోని(భారత్) అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా) రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. కాగా భారత్ తరుపున ఈ ఫీట్ సాధించిన రెండో కెఫ్టెన్ గా కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగులని సాధించాడు. రికీ పాంటింగ్ 324 మ్యాచ్లకు కెప్టెన్గా చేసి 15440 పరుగులు చేయగా.. గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్ల్లో 14 878 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్ 303 మ్యాచ్ల్లో 11561 పరుగులు చేయగా ధోని 332 మ్యాచ్లకు కెప్టెన్గా చేసి 11 207 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ దూకుడు చూస్తుంటే సులభంగా మొదటి ప్లేస్ లోకి వచ్చేస్తాడని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -