ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదట..!

1546
Ms Dhoni Is Not Thinking About Retirement, Says His Manager
Ms Dhoni Is Not Thinking About Retirement, Says His Manager

టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని అతని మేనేజర్ మిహిర్ దివాకర్ అన్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తర్వాత ధోనీ టీమిండియా తరపున మ్యాచ్ లు ఆడలేదు. గత ఏడాది కాలంగా కనీసం ఒక్క మ్యాచ్ కూడా ధోనీ ఆడలేదు. దాంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే కొందరు ధోనీకి కెరీర్ ముగిసిందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ధోనీ ఇంకా ఆడగలడు అని అంటున్నారు. ధోనీ రిటైర్మెంట్‌ వార్తల గురించి తాజాగా అతని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ మాట్లాడుతూ.. ” చిన్ననాటి ఫ్రెండ్స్ అయినప్పటికీ.. అతని క్రికెట్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుకోం. కానీ.. ధోనీ మాటల్ని బట్టి చూస్తుంటే.. అతనికి కనీసం రిటైర్మెంట్ ఆలోచనే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతని లక్ష్యం ఒక్కటే ఐపీఎల్‌లో రాణించడం. దానికోసం ఈ ఏడాది ఆరంభంలో అతను దాదాపు 30 రోజులు చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్‌ కోసం ధోనీ చాలా శ్రమిస్తున్నాడు’’ అని వెల్లడించాడు.

ఇక ఐపీఎల్ లో ధోనీ సత్తా చాటితే టీమిండియాలో చోటు దక్కుతుందని.. గత ఏడాది చివర్లోనే భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. కానీ.. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబరు చివరి నుంచి ఐపీఎల్ మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అక్తర్ బౌలింగ్‌కి సచిన్ భయపడ్డాడు.. నేను చూశా : అఫ్రిది

ధోనీని నేను అభిమానించడానికి ముఖ్యకారణం ఇదే : గంగూలీ

వన్డేల్లో సచిన్ మొదటి బంతిని ఎదుర్కోడు : గంగూలీ

విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ పంచ్.. కోహ్లీ కౌంటర్..!

Loading...