Friday, March 29, 2024
- Advertisement -

వన్డేల్లో సచిన్ మొదటి బంతిని ఎదుర్కోడు : గంగూలీ

- Advertisement -

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ తో కోట్లో అభిమానులను సంపాధించుకున్నారు. ఎంతటి బౌలర్ కైన తన బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. కొందరు బౌలర్లు సచిన్ కు బౌలింగ్ వేయాలంటే భయపడేవారు. అయితే సచిన్ వన్డేల్లో ఓపెనర్‌గా ఆడితే మాత్రం ఫస్ట్ బంతికి స్ట్రైక్ తీసుకునేందుకు ఇష్టపడట. ఇందుకు కారణంను సచిన్ తనతో చెప్పేవాడని సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించాడు.

అప్పట్లో సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ జోడిగా సచిన్- గంగూలీ పేరు తెచ్చుకున్నారు. మొత్తం 71 వన్డేల్లో ఈ ఓపెనింగ్ జోడీ.. టీమిండియా ఇన్నింగ్స్‌ని ప్రారంభించి 61.36 సగటుతో 4,173 పరుగులు చేసింది. ఇందులో 12 సెంచరీ, 16 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. గంగూలీ తర్వాత సెహ్వాగ్‌తో కలిసి సచిన్ ఓపెనర్‌గా కొనసాగాడు. భారత టెస్టు జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో తాజాగా ఫ్రీవీలింగ్ ఛాట్‌లో సౌరవ్ గంగూలీ పాల్గొన్నాడు. వన్డేల్లో మొదటి బాల్ కి స్ట్రైక్ తీసుకోవాల్సిందిగా సచిన్ ఒత్తిడి తీసుకొచ్చేవాడా..?’ అని మయాంక్ అగర్వాల్ ప్రశ్నించాడు.

ఇందుకు గంగూలీ స్పందిస్తూ..”అవును.. దానికి సచిన్ రెండు కారణాలు చెప్పేవాడు. మొదటిది.. అతను మంచి ఫామ్ లో ఉంటే దాన్ని కొనసాగించాలి. కాబట్టి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉంటాను అనేవాడు. ఇంకోటి.. ఫామ్‌లో లేకుండా ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాన్‌స్ట్రైక్‌లో ఉంటాను అనేవాడు. ఫైనల్ గా ఫామ్ లో ఉన్నా లేకున్నా అతని వద్ద సమాధానం మాత్రం ఉండేది. కొన్నిసార్లు అతని కంటే వేగంగా వెళ్లి నాన్‌‌స్ట్రైక్‌ ఎండ్‌‌లో నిల్చోవాలని ట్రై చేశా. కానీ.. అప్పటికే అతను టీవీల్లో కనిపించేవాడు. దాంతో.. స్ట్రైక్ ఎండ్ వైపు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చేది. అయితే.. ఓ రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అతని కంటే వేగంగా వెళ్లి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో నిల్చొన్నాను’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ పంచ్.. కోహ్లీ కౌంటర్..!

కెరీర్ మొదట్లో ధోనీతో మాట్లాడేవాడిని కాదు : ఇషాంత్

రోహిత్ శర్మకి ఆసీస్ బౌలర్లతో సవాల్ తప్పదు : హస్సీ

ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడు : హస్సీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -