Saturday, April 27, 2024
- Advertisement -

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

- Advertisement -

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు 172 పరుగులు.. ఈ రికార్డ్ ను అసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ పేరిట ఉంది. ఇక మొత్తగా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 175 పరుగులతో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్ కొనసాగుతున్నాడు. ఈ రికార్డులన్నిటిని గమనిస్తే… త్వరలోనే మనం టీ20ల్లో డబుల్ సెంచరీని చూసేయొచ్చు అనిపిస్తోంది. అయితే టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. మరి ఆ సామర్ద్యం ఎవరికి ఉంది ? అంటే చాలా మంది నోటి నుంచి వినిపించే పేరు రోహిత్ శర్మ.

ఈ విషయంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా హిట్ మ్యాన్ కే ఓటేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 108 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లు ఆడాడు. 138.79 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 118. ఇటీవలే హలో యాప్ ద్వారా భారత అండర్-19 టీమ్ మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గె‌తో మహ్మద్ కైఫ్ మాట్లాడుతుండగా.. టీ20ల్లో డబుల్ సెంచరీ గురించి చర్చ వచ్చింది. దాంతో ఆ సత్తా రోహిత్ శర్మకు ఉందని కితాబిచ్చిన కైఫ్.. టీ20ల్లో సెంచరీ తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్‌రేట్‌ పతాక స్థాయిలో ఉంటోందని గుర్తుచేశాడు.

వన్డేల్లో ఇప్పటికే రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. “టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సామార్ద్యం రోహిత్ కు ఉంది. ఎందుకంటే.. అతని స్ట్రైక్‌రేట్ మ్యాచ్ జరిగేకొద్దీ క్రమంగా పెరుగుతూ పోతుంది.. కొన్నిసార్లు అతను నెమ్మిదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. శతకం తర్వాత మాత్రం అతని స్ట్రైక్‌రేట్ 250-300 మధ్యలో ఉంటుంది. కాబట్టి.. రోహిత్ కచ్చితంగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకోగలడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో టీమ్ 200-250 పరుగులు చేయడమే కష్టంగా ఉండేది.. కానీ ఇప్పుడు 400 పైనే స్కోర్ చేస్తున్నారు” అని కైఫ్ చెప్పుకొచ్చారు.

అత‌ని కార‌ణంగానే నా కెరీర్‌ను మలుపు తిరిగింది : కోహ్లీ

ధోనీ వైపు చూసి ‘ఈరోజు కాదు’ అని చెప్పా : బంగ్లా క్రికెటర్

చహల్ నీ కటింగ్ చూసి మీ కుక్కలు నీ వెంటబడ్డాయనుకుంటా : కోహ్లీ

స్లెడ్జింగ్‌కు దిగిన కోహ్లీ.. మళ్లీ నోరు జారలేదు : బంగ్లాదేశ్ క్రికెటర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -