Friday, April 26, 2024
- Advertisement -

ర‌వీంద్ర జ‌డేజాను ఎదుర్కోవ‌డం కష్టం : స్మిత్

- Advertisement -

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పిన్‌ను చాలా సులభంగా ఆడగలనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రధానంగా మిగ‌తా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే త‌న ఆట‌తీరు సంతృప్తిక‌రంగా ఉంటుంది. తాజాగా ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ చాట్ షోలో స్మిత్ మాట్లాడుతూ.. ఉప‌ఖండంలో భార‌త స్పిన్న‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించాడు.

జ‌డేజా సరైన ప్రదేశాల్లో బంతులు విసురుతాడని.. అతని లైన్ అండ్ లెంగ్త్ కూడా చక్కగా ఉంటుందని స్మిత్ ప్రశంసించాడు. అంతేకాకుండా అతను వేసే బంతుల్లో విభిన్నమైన వేరియేషన్స్ చూపిస్తాడని స్మిత్ పేర్కొన్నాడు. ఇక ఉప‌ఖండంలో స్మిత్ నాలుగు సెంచ‌రీలు చేశాడు. భార‌త్‌పై మూడు, శ్రీలంక‌పై ఒకటి సాధించాడు.

అలాగే భార‌త్‌, లంక‌, బంగ్లాదేశ‌ల్లో ఒక్కో ఫిఫ్టీ సాధించిన స్మిత్‌.. యూఏఈలో రెండు అర్ధ‌సెంచ‌రీల‌ను బాదాడు. ఇక చివ‌రిసారిగా 2016-17లో సీజ‌న్‌లో ఆస్ట్రేలియా.. భార‌త గ‌డ్డ‌పై నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో 499 ప‌రుగుల‌తో ఆసీస్ టాప్ స్కోర‌ర్‌గా స్మిత్ రాణించాడు. ఇక 25 వికెట్ల‌తో జ‌డేజా లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -