Monday, April 29, 2024
- Advertisement -

టీమిండియా బలం అదేనా?

- Advertisement -

భారత్ వేదికగా 13వ ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక సారి స్వదేశంలో మెగా టోర్ని జరగనుండటంతో టీమిండియాపై భారీ అంచనాలు నెలకొనగా ఇక హోం గ్రౌండ్స్‌లో భారత ప్రధాన బలం స్పిన్‌. ఎందుకంటే ఇది అనేకసార్లు నిరూపితమైంది. ఓ వైపు పేస్‌లో బుమ్రా,షమీ,సిరాజ్‌ వంటి మేటి బౌలర్లు ఉన్నా స్పిన్నే భారత ప్రధాన అస్త్రం కానుంది. ఎందుకంటే టాప్‌ టీమ్‌లు అన్ని భారత స్పిన్ ముందు తలవంచాల్సిందే.

గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీతో పాటు మిడిలార్డర్ లో ఇషన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య మంయి ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు బౌలింగ్‌ విభాగంలో రాణిస్తే భారత్‌ మూడోసారి ప్రపంచకప్ ఎగరేసుకపోవడం ఖాయం. .

స్పిన్ విషయానికొస్తే జడేజా, అశ్విన్, కుల్దీప్ కీలకం కానున్నారు. ముగ్గురు ముగ్గురే. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న బౌలర్లే. అందుకే తలపడే జట్టును బట్టి భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నెల 8 న వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.

భారత జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్),హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్),గిల్,కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజా,శార్దుల్ ఠాకూర్,బుమ్రా,సిరాజ్,కుల్దీప్ యాదవ్,షమీ,అశ్విన్,ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -