స్వ‌దేశంలో సిరీస్‌ టీమిండియాకు షాక్‌..

- Advertisement -

ఆస్ట్రేలియాపై చారిత్ర‌క విజ‌యంతో జోష్ మీదున్న టీమిండియా ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడ‌నుంది. అయితే, స్వ‌దేశంలో జ‌రుగ‌నున్న‌ సిరీస్ ప్రారంభానికి ముందు భార‌త జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఆసీస్ టూర్‌లో గాయపడిన స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జ‌ట్టుకు దూరమ‌య్యాడు. కాగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడేజా గబ్బా టెస్టు ఆడలేద‌న్న సంగ‌తి తెలిసిందే.

‌బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి జడేజా బొటనవేలికి బలంగా తగిలింది. దీంతో అత‌డికి ఆస్ట్రేలియాలోనే సర్జరీ చేశారు. కనీసం ఆరువారాల విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమవడంతో పాటు వన్డే సిరీస్‌లోనూ ఆడతాడా లేదా అన్న‌ది సందేహంగానే ఉంది. ఒక‌వేళ సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తే వ‌న్డేల్లో జ‌డేజా విష‌యాన్ని సెలక్టర్లు పరిశీలిస్తార‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది

- Advertisement -

కాగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లి జ‌ట్టులో చేరాడు. అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ చోటు ద‌క్కించుకున్నారు.

నాన్న క‌ల నెర‌వేర్చాల‌నే..

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

‘నా తండ్రినిఅలా అవమానిస్తే.. నేనేంటో చూపించేవాడిని’

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News