Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీ ఆపడం ఎవరి వల్ల కాదు : స్టీవ్‌ స్మిత్‌

- Advertisement -

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా స్మిత్‌, కోహ్లీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తనకంటే కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని స్మిత్ అంటున్నాడు.

తాజాగా స్టీవ్ స్మిత్ ఓ జాతీయ మీడియాతో మాటాడుతూ..” విరాట్ కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతను ఎంత గొప్ప ఆటగాడో అతని రికార్డులే చెబుతాయి. కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడు. పరుగుల దాహంతో ఉన్న అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు.

కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్‌వన్‌ స్థానానికి తీసుకొచ్చాడు. ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు అడ్డుకోవడం అంత సులువు కాదు. ఇక ప్రస్తుతం నాలుగు రోజుల టెస్ట్‌ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ.. నేను మాత్రం ఐదు రోజుల టెస్ట్‌ క్రికెట్‌నే ఎక్కువగా ఇష్టపడతా” అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -