Friday, April 26, 2024
- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఇద్ద‌రు…..

- Advertisement -

టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వేట‌లో బిజీగా మునిగిపోయింది బీసీసీఐ. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ఆహ్వానించింది. కోచ్ రేసులో ప్ర‌ధానంగా ఇద్ద‌రు పోటీలో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టుకు తొలి వరల్డ్ కప్ అందించిన ట్రేవర్ బేలిస్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్టు సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. దీంతో ఏడేళ్ల‌పాటు కోచ్‌గా సేవ‌లందించిన టామ్ మూడీ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పుకున్నారు.

సన్‌రైజర్స్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. టీమిండియా కోచ్‌గా వచ్చే అవకాశం ఉందని ప్రచారం ముమ్మ‌రంగా సాగుతోంది. గ‌తంలో ర‌విశాస్త్రికి గ‌ట్టిపోటీ ఇచ్చిన టామ్ మ‌రో సారి టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తిని చూపుతున్నారు. టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసినప్పటికీ.. 45 రోజులపాటు పొడిగించింది. సౌతాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటన ప్రారంభించే సమయానికి కొత్త కోచ్‌తోపాటు ఇతర స్టాఫ్ ను నియ‌మించుకోవాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పుడున్న కోచ్‌ రవిశాస్త్రి కూడా మరోసారి కోచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌ను ఫైన‌ల్ చేర‌కపోవ‌డంతోపాటు రోహిత్ తో విబేధాలు ఉన్నాయ‌నె వార్త‌లు వ‌స్తున్నాయి.

శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేయడంతోపాటు ఐపీఎల్ తొలి సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగపూర్ రైడర్స్ జట్టుకు 2017 నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి పని చేయడంతోపాటు.. చక్కటి కోచింగ్ స్కిల్స్ టామ్ మూడీ సొంతం. అందుకే బీసీసీఐ ఆయ‌న‌వైపె మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే కూడా కోచ్ పదవి కోసం ప్రధానంగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కోచ్‌గా ర‌విశాస్త్రినె ఎన్నుకుంటారా లేకా కొత్త వారికి అవ‌కాశం ఇస్తార అనేది త్వ‌రలో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -