Saturday, April 27, 2024
- Advertisement -

మరో సారి వార్తల్లో కెక్కిన పాండ్యా మాజీ ప్రేయసి…మీడియాకు వార్నింగ్…

- Advertisement -

హార్ధిక్ పాండ్యా మాజ ప్రేయసి మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ సారి మీడియాపై విరుచుకు పడింది. గతంలో చానాళ్ల పాటు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ అమ్మడు, ఆపై పాండ్యాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె ఓ విషయంలో పాండ్యా సాయం కోరినట్టు హిందీ వార్తా పత్రికలో వార్త వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

దీనిపై ఊర్వ‌శి మండిప‌డింది. ఇవన్నీ పిచ్చి వార్తలని మండిపడింది. . ద‌య చేసి మీడియా ఛానల్స్ చెత్త వార్త‌ల‌ని ప్ర‌చురించొద్దు. ఇలాంటి వార్త‌ల వ‌ల‌న కుటుంబంలో గొడ‌వ‌లు అవుతాయి. రేప‌టి రోజు ఏదైన జ‌రిగితే నా కుటుంబానికి నేను జ‌వాబు చెప్పుకోలేను అని పేర్కొంది.పాండ్యా, ఊర్వశీలు కలిసి ఎన్నో పార్టీలకు జంటగా వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో వారిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారని, పెళ్లికి సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

గ్రేట్ గ్రాండ్ మస్తీ’ , భాగ్ జానీ, హేట్ స్టోరీ వంటి చిత్రాల‌లోను న‌టించి పాపుల‌ర్ అయింది ఊర్వశీ . ఇటీవ‌ల‌ అండ‌మాన్ నికోబార్ ఐలాండ్ ప్ర‌భుత్వం ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గౌర‌వాన్ని అందించింది. ఐలాండ్‌లోని ఓ పుష్పానికి ఊర్వ‌శీ రౌతెలా పేరు పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -