Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీకి క‌ల‌సి వ‌స్తున్న‌ సంక్రాంతి పండుగ‌..

- Advertisement -

అడిలైడ్‌లో ఆసిస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ సెంచ‌రీ చేసి గెలుపులో కీల‌క పాత్ర‌పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఏటా జనవరి 15న అతనికి బాగా కలిసొస్తోంది. కోహ్లి గత మూడేళ్లుగా ఒకే రోజున సెంచరీలు సాధించాడు.

ఈ ఏడాది కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. చిత్రమేంటంటే గత రెండేళ్లలో జనవరి 15నే కోహ్లీ తొలి సెంచరీలు చేశాడు. 2017 జనవరి 15న ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య పుణెలో వన్డే మ్యాచ్‌ జరిగింది. కోహ్లీ 105 బాల్స్‌కి 122 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లో 27వ సెంచరీని సాధించాడు.

సరిగ్గా ఏడాది అనంతరం 2018లో మళ్లీ జనవరి 15నే కోహ్లి శతకం బాదాడు. ఈసారి వన్డేల్లో కాకుండా టెస్ట్‌ల్లో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడుటెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి(153) సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడం భారత్‌ పరాజయంపాలైంది.ఇక తాజాగా ఆస్ట్రేలియాపై కోహ్లి ఇదే జనవరి 15న సెంచరీ నమోదు చేయడంతో కోహ్లికి ఈ తేది ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మూడేళ్లుగా కోహ్లీ ఏడాదిలో తన తొలి సెంచరీని జనవరి 15నే సాధించడంతో ఈ రోజును క్లోహ్లీ డేగా పిలవడం మొదలుపెట్టారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ… వరుస ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -