వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ.. ఇదో సంచలన రికార్డు.!

838
warner highest score record pink ball test
warner highest score record pink ball test

అస్ట్రెలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగుల వర్షం చూపించాడు. యాషెస్‌ సిరీస్‌లో విఫలమైన వార్నర్.. పాక్ తో జరిగిన మొదటి టెస్టులో భారీ సెంచరీతో తానేంటో చూపించాడు. అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో చూపించాడు.

నిన్నటి మొదటి రోజు ఆటలో సెంచరీ చేరిన వార్నర్.. ఈ రోజు ఆటలో దాన్ని ట్రిపుల్ సెంచరీగా మలచుకున్నాడు. 394 బంతుల్లో 37 ఫోర్లతో ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో వార్నర్ కు ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ఇక ఆస్ట్రేలియా తరపున ఈ రికార్డు సాధించిన ఏడో బ్యాట్స్ మెన్ గా వార్నర్ నిలిచాడు. ఇక పాక్ పై ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో అసీస్ ఆటగాడిగా.. ఓపెనర్ గా నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.

మొత్తంగా చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. స్టీవ్‌ స్మిత్‌(36) మూడో వికెట్‌గా ఔటైనప్పటికీ వార్నర్‌ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. డబుల్‌ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుని ఆసీస్‌కు భారీ స్కోరును సాధించిపెట్టాడు. ఆసీస్‌ 126 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 569 పరుగులు చేసింది.

Loading...