Saturday, April 27, 2024
- Advertisement -

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను తప్పిస్తారా?.. మమ్మల్ని తప్పుకోమంటారా?

- Advertisement -

భార‌త్‌, పాక్ మ‌ధ్య అంతంత‌మాత్రంగానే ఉన్న సంబంధాలు పుల్వామా దాడితో పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా భారత సైనికులు మృతి చెంద‌డంతో భార‌త్ తీవ్ర నిర్ణ‌యాలు తీసుకోంటోంది. ఉగ్ర‌వాదాన్ని పోషిస్తున్న పాక్ పై త‌క్ష‌న‌మే ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని యావ‌త్ భార‌తావ‌ని కోరుతోంది. కూర‌గాయ‌లు, తేయాకు మొద‌లైన వ‌స్తువులను పాక్‌కు ఎగ‌మ‌తి చేయ‌కుండా వ్యాపారులు నిషేధించారు. ఇప్పుడు క్రికెట్‌పై కూడాదీని ప్ర‌భావం ప‌డింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్‌తో ఆడొద్ద‌ని ఇప్ప‌టికే బీసీసీఐడిమాండ్ చేశారు మాజీ క్రికెట‌ర్లు.

దేశంలోని అన్ని వర్గాల నుంచి పాక్‌పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా స్పందించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా దానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ తెలిపింది. అయితే తెర‌పైకి మ‌రో కొత్త వాద‌న‌ను తీసుకొచ్చింది.త్వరలో జరగనున్న ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని కోరుతోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలక మండలి (సీవోఏ).. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌ పేరిట ఓ లేఖను సిద్ధం చేసింది.ప్రపంచకప్ నుంచి పాక్‌ను నిషేధించాలని, లేదంటే తామే వైదొలుగుతామని ఆ లేఖలో హెచ్చరించింది.

ఇద‌లా ఉంటే ఈ విషయంలో వినోద్ రాయ్‌తో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ విభేదిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుక్ర‌వారం జ‌రిగే భేటీలో పాక్‌తో మ్యాచ్ ఆడాలా వ‌ద్దా అనేది తేల‌నుంది. మ‌రో వైపు మాజీ కెప్టెన్ గంగూలి కూడా స్పందించారు. పంచకప్‌లో పది దేశాలు ఆడతాయని, ఒక్కో దేశం మరో దేశంతో తలపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్రపంచకప్‌లో భారత్ ఒక మ్యాచ్ ఆడకపోవడం పెద్ద సమస్య కాబోదని అభిప్రాయపడ్డాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ లేకుండా ముందుకెల్ల‌డం క‌ష్టం అని అభిప్రాయ‌ప‌డ్డారు. దీన్ని అమ‌లు చేసే స‌త్తా బీసీసీఐకి ఉంద‌న్నారు. పాకిస్థాన్‌కు తప్పకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనన్న గంగూలీ.. పాక్‌తో క్రికెట్ ఒక్కటే ఆడకపోవడం కాదని, హాకీ, ఫుట్‌బాల్.. ఇలా ప్రతీ ఆటను పాక్‌తో ఆడడాన్ని మానుకోవాలని సూచించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -