Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీ కెప్టెన్సీపై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. మూడు ఫార్మెట్ లకు ఒకరే కెప్టెన్ గా ఉంటె పనిభారం పెరగుతుందని అందువల్ల టెస్టు, వన్డే జట్లకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగిస్తూ.. టీ20 పగ్గాలని మాత్రం రోహిత్ శర్మకి అప్పగించాలనే ప్రతిపాదన రెండు నెలల క్రితం వచ్చింది.వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. టీ20ల్లో మెరుగైన కెప్టెన్సీ రికార్డ్ ఉన్న రోహిత్ శర్మకి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే సెలక్టర్లు మాత్రం కోహ్లీనె మూడు ఫార్మెట్ ల సారధిగా కొనసాగిస్తున్నారు.

కెప్టెన్సీ వ్యవహారంపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లికి వర్క్‌లోడ్‌ ఎక్కువైందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తే కెప్టెన్సీ నుంచి తప్పిస్తే బెటర్‌ అని అభిప్రాయపడ్డాడు.గతంలో టెస్టు, వన్డే రూపంలో రెండు ఫార్మాట్లు మాత్రమే ఉండేవి. కాబట్టి.. కెప్టెన్‌కి పెద్ద ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. కాని ఇప్పుడు టీ20 ఫార్మెట్ కూడా ఉండటంతో మూడు ఫార్మాట్లలో టీమ్‌ని ఒకరే నడిపించాలంటే కష్టమే.

ఒక వేల కోహ్లీపై ఒత్తిడి ఎక్కువయితే కేవలం టెస్టు సారథ్య బాధ్యతలకు పరిమితం చేయాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథిగా రోహిత్‌ శర్మను నియమిస్తే బెటర్‌ అంటూ సలహా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -