మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం ‘ఖైదీ నెం150’. ఈ సినిమాతో మెగాస్టార్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు మెగా కుటుంబం, ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నెల 7 వ తేదీన మంగళగిరిలో హాయ్ ల్యాండ్ లో ఈ వేడుకను పండగలా నిర్వహించాలని నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. ఈ ఫంక్షన్లో హైలెట్ గా నిలవనున్న అంశాలివే..
* ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరుకానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రప్పించేందుకు చరణ్ ప్రయత్నిస్తున్నారు.
* మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు, నిర్మాతలు చాలా మంది ఈ కార్యక్రమంకు వస్తున్నట్లు తెలుస్తోంది. చిరుతో ఇదివరకు కలిసి పనిచేసిన అనేక మంది ఈ జాబితాలో ఉన్నారు. ప్రత్యేకంగా చరణ్ వారందరినీ ఆహ్వానించినట్లు తెలిసింది.
* చిరు ఫ్యాన్స్ దాదాపు ఒక లక్షమంది తరలి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. వారి కోసమే హాయ్ ల్యాండ్ స్థలాన్ని ఈ ఈవెంట్ కి ఎంపిక చేశారు.
* రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ పెర్ ఫార్మెన్స్ ఉంటుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటను ఎక్కువమంది డ్యాన్సర్లు తో స్టేజీపై దేవీ అదరగొట్టనున్నారు. అంతేకాదు ఈ పాటకు మెగా హీరోలందరూ స్టెప్పులు వేయనున్నారు.
* సాయంత్రం ఆరుగంటలకు మొదలుకానున్న ఈ ఫంక్షన్ కి రానా దగ్గుబాటి, నవదీప్, అనసూయ యాంకర్లుగా వ్యవహరించి జోష్ పెంచుకున్నారు. ఈ కారక్రమాన్ని మీరు మిస్ అవుతారని బాధపడనవసరం లేదు. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం “మా మూవీస్” ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Related
