దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 32,987 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 257 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో సీరియస్ గా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది.జిల్లా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 60 గంటల పాటు లాక్డౌన్ విధించింది. శనివారం ఉదయం 8గంటల నుంచి 60 గంటల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ ప్రేర్నా పేట్రియాట్ పేర్కొన్నారు.
నిత్యావసరాలకు సంబంధించిన దుఖానాలు మాత్రం తెరవడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలు, మెడికల్ స్టోర్లు, పారిశ్రామిక ప్రాంతాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.2వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.!
