- Advertisement -

ఇంతకీ పవన్ ఏం చెప్పదలుచుకున్నారు?

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. టార్గెట్ జగన్‌ పేరుతో టీడీపీతో దిగజారి పవన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు జనసైనికులు. ఇదే నేపథ్యంలో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి టీడీపతో పవన్ పొత్తు ప్రకటించిన తర్వాత జనసేనాని పొత్తులో అడ్జస్ట్ కావడం తప్ప మిగిలింది ఏమి లేదంటూ వార్తలు వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ఇదే జరిగింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న లాభపడేది బాబే. అందుకే పవన్‌పై సైతం ఇదే విమర్శలు రాగా ఇప్పుడు అదే జరుగుతోంది. జనసేనకు 50కి పైగా స్థానాలు కేటాయించాలని కోరిన దాంట్లో సగం ఇచ్చేందుకే చంద్రబాబె మొగ్గుచూపారని ప్రచారం జరుగుతుండగా దానికి పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే జనసైనికుల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ ఆ పార్టీ నేతలను నిరాశ పరుస్తున్నాయి. తనను ప్రధాని మోడీ,జేపీ నడ్డా,అమిత్ షా, చంద్రబాబు అర్ధం చేసుకున్నారు కానీ జనసైనికులు మాత్రం అర్ధం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఒక అడుగు ముందుకేసి తన నిర్ణయాలను వ్యతిరేకించే వారు వైసీపీలోకి వెళ్లిపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తుపై ఎవరు మాట్లాడిన సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.

పవన్ వ్యాఖ్యలతో జనసేన నేతలు సైతం ముక్కున వేలు వేసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పొత్తు పేరుతో టీడీపీ ఏం చేసినా అడ్జస్ట్ అయ్యేందుకే సిద్ధమయ్యారు పవన్. ఇదే విషయాన్ని కార్యకర్తలు తెలిపారు. అయితే సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన ఇతర పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తారు..?కానీ పవన్ మాత్రం విచిత్రంగా సొంతపార్టీ నేతలకే హూకుం జారీ చేశారు. ఇదే ఇప్పుడు జనసైనికులను ఆలోచనలో పడేలా చేసింది. ఒక్క వ్యక్తి(పవన్‌) స్వార్ధం కోసమా ఇన్ని రోజులు పనిచేసింది అంటూ సమావేశం అనంతరం పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమంది నేతలైతే పవన్ పూర్తిగా టీడీపీకి తొత్తులా మారి బాబు పల్లకీ మోస్తున్నారని..ఇది త్వరలోనే ఆయన రాజకీయ పతనానికి దారి తీయడం ఖాయమని మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -