- Advertisement -

బాబు బుజ్జగింపులు…నేతల ససేమీరా!

- Advertisement -

వైసీపీ ఎఫెక్ట్‌తో టీడీపీ చరిత్రలో తొలిసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయక ముందే అభ్యర్థుల ప్రకటన చేశారు చంద్రబాబు. అయితే అభ్యర్థుల ఎంపిక ఆశావాహులనే కాదు సీనియర్లకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు బాబు. ఆదివారమంతా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకే సరిపోగా కొంతమంది తగ్గేదేలే అని చెప్పినట్లు సమాచారం.

టికెట్ ఆశించి భంగపడ్డ గంటా శ్రీనివాసరావు,ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి వేర్వేరుగా చంద్రబాబును కలిశారు. అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పిన కొంతమంది నేతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది.

ఇక గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి నుండే పోటీ చేయాలని తేల్చి చెప్పారు చంద్రబాబు. అయితే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు గంటా. దీంతో ఆయన అసంతృప్తిగానే వెళ్లిపోయారు. అలాగే బొడ్డు వెంకటరమణ,ఆలపాటి రాజాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వెనక్కితగ్గలేదని తెలుస్తోంది.

ఇక మరో నేత పీలా ఆనంద్‌ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా అసంతృప్తిగానే వెళ్లిపోయారు. మొత్తంగా చంద్రబాబు బుజ్జగింపుల పర్వం అంతగా సత్ఫలితాలను ఇవ్వలేదని పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికి పలు జిల్లాల్లో టీడీపీ ,జనసేన జెండాలను పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలు తొలగిస్తున్న పరిస్థితి ఉండటంతో అసంతృప్తులను దారికి తెచ్చుకోవడం తలకు మించిన భారమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -