Thursday, May 9, 2024
- Advertisement -

వారిద్దరి మధ్యలో పవన్ కరివేపాకేనా?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో జనసేనాని పరిస్థితి ఏంటీ?టీడీపీ – బీజేపీ మధ్యలో పావేనా?, ఎన్నికల తర్వాత పవన్‌ను పక్కన పెట్టడం ఖాయమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి వరకు పొత్తుపై దోబుచులాడగా లాస్ట్‌కు పవన్‌ను బకరా చేస్తూ ఒక్కశాతం ఓటు బ్యాంకులేని బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది.

ఇక టీడీపీ – జనసేన – బీజేపీ తొలి సభ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అయితే ఈ సభలో ప్రధాని మోడీ భజనతోనే సరిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు అయితే మోడీని ఎప్పుడూ లేనంతగా పొగిడేశారు. ఇక ఈ సభలో పవన్ కంటే ఎక్కువగా చంద్రబాబుకే ఇంపార్టెన్స్ ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతుండగా రానురాను పవన్ సైడ్ అయిపోవడం ఖాయమనే తెలుస్తోంది.

ఎందుకంటే జనసేన కంటే టీడీపీ, బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానాలే ఎక్కువ. ఇక జనసేన పోటీ చేసేది రెండే ఎంపీ స్థానాలు. ఈ రెండింటిలో గెలిచేది అనుమానమే. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పాత్ర ఏంటనేది అనుమానమే. ఎంపీ స్థానాలు గెలిచే పార్టీకే బీజేపీ ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కంటే చంద్రబాబే బీజేపీకి ముఖ్యం అవుతాడు. అందుకే మోడీ మార్క్ వ్యూహం అంటే ఎన్నికల వరకు టీడీపీ – బీజేపీలను సమదూరంలో ఉంచాలని బీజేపీ నిర్ణయం తీసుకుందట. ఎన్నికలు పూర్తి కాగానే పవన్‌ను కరివేపాకులా తీసిపారేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక జనసైనికుల్లో కూడా ఇదే భావన ఉండటంతో ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -