- Advertisement -

జగన్ సమక్షంలో వైసీపీలో చేరికల పర్వం

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో ఓ వైపు సీఎం జగన్ దూసుకుపోతుండగా మరోవైపు ఆ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాకినాడ మాజీ మేయర్ సరోజతో పాటు పెద్ద ఎత్తున నేతుల పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు జగన్. అలాగే నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి, కాటంరెడ్డి జగదీష్ రెడ్డి,టీడీపీ నేత చేజర్ల సుబ్బరావుతో పాటు కాంగ్రెస్‌ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

అ సందర్భంగా కాకినాడ మాజీ మేయర్ సరోజ మాట్లాడుతూ…జనసేనలో మహిళలకు,బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లాలో కూటమి అభ్యర్థులను ఓడిస్తామని శపథం చేశారు. జగన్ నాశనం కావాలని కోరుకుంటున్న చంద్రబాబు, పవన్ నాశనం అయిపోతారని దుమ్మెత్తిపోశారు.

మరోవైపు జగన్ చేపట్టిన మేము సిద్ధం యాత్రకు ప్రజలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ రోడ్డు షోకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. తమ అభిమాన నేతపై ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -