దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి?,ముఖ్యంగా ఏపీలో ఎవరు విజయం సాధిస్తారు అన్నదానిపై ఉపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు ప్రజలు.
ఇక కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక కొంతమందైతే ఏకంగా ఎన్నికల ఫలితాలను థియేటర్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలోని ఎస్ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లలో ఈ ఫలితాలు ప్రసారం చేయనున్నాయి.ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కూడా.
ఇవాళ సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. పలు సంస్థలు ఇప్పటికి ప్రజల నాడిని అంచనా వేయగా ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
