ధైర్యంగా థియేటర్లలో సినిమా చూడవచ్చు..

- Advertisement -

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. టియేటర్లకు సంబంధించిన అంశంతో పాటు సినిమా టికెట్ల ధర, ఆన్‌లైన్‌ టికెటింగ్ విధానంపై మంత్రితో సినీ ప్రముఖులు చర్చించారు.

కరోనా థర్డ్‌వేవ్‌ అంటూ అసత్య ప్రచారం జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ఇంత వరకు కరోనా థార్డ్‌వేవ్‌ లేదని, టికెట్ల ధరలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచడంలేదని ఆయన స్పష్టం చేశారు. సినీ నిర్మాతలు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

మరోవైపు ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మ వద్దన్నారు. సినీ అభిమానులు కోవిడ్ రూల్స్ పాటిస్తూ ధైర్యంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడవచ్చని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఇచ్చినా.. కోవిడ్‌ భయంతో గత కొన్ని రోజులు ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్స్‌కు రావటం లేదన్నారు. ‘అఖండ’ విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగిందని మంత్రి తెలిపారు.

అన్నదాతలను ఆదుకోండి

ముంచుకొస్తున్న జవాద్

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -