తెలంగాణాలో థియేటర్ లు మళ్ళీ ఎందుకు మూత పడుతున్నాయి?

- Advertisement -

ఎట్టకేలకు లాక్ డౌన్ తరువాత సినిమా థియేటర్లకు విముక్తి లభించింది. సినిమా ప్రేక్షకులు మళ్ళీ సందడి చేస్తున్నారు. ఇప్పటికి థియేటర్ లు ఓపెన్ అయ్యి సరిగ్గా యాభై రోజులు అవుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో మరోసారి థియేటర్లు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయట. దీనికి కారణం ఏమిటంటే సినిమా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య జరిగిన గొడవే కారణమట. మల్టీప్లెక్స్ లకు ఉండే హక్కులను సింగిల్ స్క్రీన్ లకు కూడా వర్తింపజేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ ల మాదిరే పర్సంటేజ్‌ సిస్టంను సింగిల్ స్క్రీన్ ల విషయంలో అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు.

అంతేకాకుండా.. పెద్ద సినిమాలు విడుదలైన ఆరు వారాల తరువాత, అలానే చిన్న సినిమాలు విడుదలైన నాలుగు వారాల తరువాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను గనుక అంగీకరించకపోతే మార్చి 1నుండి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య సీరియస్ గా చర్చలు కూడా జరిగాయట.

- Advertisement -

ఇక దీనికి సంబంధించిన ఈ మీటింగ్ లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో పాటు డీవీవీ దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే థియేటర్లలో సందడి మొదలైంది. పైగా ఇప్పటినుండి వరుసగా థియేటర్లలో సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు ఏ విధానంగా స్పందిస్తారో ఏ విధంగా వారి డిమాండ్లను నెరవేరుస్తారో చూడాలి…

ఛత్తీస్‌గఢ్‌లోని దారుణం.. బాలికపై అత్యాచారం.. అడ్డొచ్చిన ఇద్దరి హత్య!

పసిడి ప్రేమికులు శుభవార్త.. దిగోస్తున్న బంగారం ధర!

వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -