- Advertisement -

విశాఖ ఎమ్మెల్సీ… పోటీ చేయాలా? వద్దా…?, మీమాంసలో టీడీపీ

- Advertisement -

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కాగా ప్రచారాన్ని ముమ్మురం చేసింది వైసీపీ. ఆ పార్టీ తరపున ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపారు జగన్. ఇక ఇప్పటికే విశాఖ పరిధిలోని నియోజకవర్గాల వారీగా ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్.

ఇక నామినేషన్ల పర్వం ప్రారంభమైన అభ్యర్థిని ప్రకటించలేదు అధికార టీడీపీ. తొలుత పోటీ చేస్తామని, అభ్యర్థుల ఎంపికలో పోటీ ఎక్కువగా ఉందని చెబుతూ వచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోని నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. కానీ పోటీ చేయాలా? వద్దదా అనే మీమాంసలోనే ఉండిపోయింది టీడీపీ.

అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు.. వద్దని కొందరి అభిప్రాయం చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. నివేదిక బట్టి కూటమి అభ్యర్థి పోటీపై రానుంది. అయితే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో తగినంత బలం లేకపోవడంతో పోటీ నుండి తప్పుకుంటేనే బాగుంటుందని కొంతమంది నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల బలాబలాలను పరిశీలిస్తే వైసీపీకి 600 మంది సభ్యులుండగా టీడీపీ కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా 14న పరిశీలన,ఆగస్టు 16న ఉపసంహరణకు గడువు . ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరగనుంది. సెప్టెంబరు 3న ఫలితాలు రిలీజ్ కానుండగా సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -