రాయలసీమ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. మంత్రి అఖిలప్రియ,వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. అసలు అఖిల ఏ పార్టీ.. శిల్పా మోహన్ రెడ్డి ఏ పార్టీ అంటూ ప్రశ్నించారు.
ఇవాళ వైసీపీ జెండా మోస్తున్న శిల్పా,టీడీపీ కండవా కప్పుకున్న అఖిలప్రియలు రేపు పొద్దున ఆయా జెండాలను ఎక్కడ పారేస్తారంటూ విమర్శించాడు. అంతేకాకుండా.. ఏపీ సీఎం.. చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చాడని.. సన్నపాపకు పెద్ద గౌన్ తొడిగినాడు అంటూ విమర్శలు విమర్శలు గుప్పించాడు. చంద్రబాబేమో పెద్దపాప..ఆయనేమో చిన్న గౌన్ తొడుక్కున్నాడంటూ ఎద్దేవ చేశాడు.
{loadmodule mod_custom,GA1}
ఏపీ వెరుపడిన తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారని.. మోడీని కలవడం కోసం.. పొద్దున ఫ్లైట్ ఎక్కితే,జగన్ సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతున్నాడని అన్నాడు. జగన్ మోడీ దగ్గరకి వెళ్లి చెవుల్లో గుసగుసలాడుతున్నాడని అన్నాడు బైరెడ్డి. జగన్, చంద్రబాబు.. వీరిద్దరు మోడీ జపం చేయడమే పనిగా మారిందని అన్నారు. అసలు వైసీపీ పార్టీ.. శిల్పా మోహన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చినట్లు అని ప్రశ్నించాడు బైరెడ్డి. పార్టీ పెద్దలు కాబట్టి టికెట్ ఇచ్చే అధికారం ఉంది. కానీ, శిల్పామోహన్ రెడ్డికిఎందుకు టికెట్ ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశాడు. ఈ నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి ఫలానా సేవలు చేశాడనా? ఆయన రాయలసీమను బాగు చేస్తాడనా?.. మోహన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? బాగా పార్టీలు మారాడనా? లేకపోతే సూట్ కేసుల నిండా డబ్బులు తెచ్చాడనా?’ అంటూ.. విమర్శలు చేశారు బైరెడ్డి.
{youtube}wWnpSsaZ5-I{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related