- Advertisement -

భారత్‌ – పాక్‌ మ్యాచ్‌పై సుప్రీం

- Advertisement -

ఆసియా కప్ T20 టోర్నమెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 14న జరగనున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని (PIL) అత్యవసరంగా విచారణకు తీసుకోవడాన్ని సుప్రీం కోర్టు నిరాకరించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయి బెంచ్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఏమిటి అత్యవసరం? ఇది ఒక మ్యాచ్, జరగనివ్వండి” అని జస్టిస్ మహేశ్వరి వ్యాఖ్యానించారు. రేపటికి విచారణకు అనుమతించాలంటూ న్యాయవాది చేసిన విన్నపాన్ని విన్న తర్వాత ఈ వ్యాఖ్య చేశారు.

మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 14)న జరగనుంది. రేపు విచారణ జరగకపోతే పిటిషన్ ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్పగా, న్యాయమూర్తి “మ్యాచ్ ఈ ఆదివారం? మేము ఇప్పుడు ఏం చేయగలం? జరగనివ్వండి. మ్యాచ్ జరగాలి అని సమాధానమిచ్చారు. ప్రతి రోజూ ఒక మ్యాచ్ ఉంటుంది. ఒక బంతి… ఒక జట్టు, ఇంకో జట్టు అని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -