- Advertisement -

మూడు రోజుల్లోనే..భారత్ గెలుపు

- Advertisement -

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సధించింది. కేవలం మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగియడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో – 448/5 (జురెల్ 125, జడేజా 104, రాహుల్ చేస్ 2-90)* పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో – 162 (గ్రీవ్స్ 32, సిరాజ్ 4-40, బుమ్రా 3-42) మరియు 146 (అథనేజ్ 38, జడేజా 4-54, సిరాజ్ 3-31) మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ మరియు 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రవీంద్ర జడేజా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలుస్తున్నాడు. వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి, నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా కొత్త హోమ్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. అతని 104 నాటౌట్ మరియు 4/54 బౌలింగ్ స్పెల్‌తో భారత్ రెండు రోజులన్నర ముందుగానే ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది.

ఇక భారత్‌లో 31 ఏళ్లలో ఒక్క టెస్టు మ్యాచ్‌ గెలవలేదు విండీస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -