ఈ ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాయం చేస్తామని చెప్పి చేతులెత్తేశారు అన్నారు. పెట్టుబడి సాయం కింద రూ.40 వేలకు బదులు రూ.5 వేలు ఇచ్చారు అని ఆరోపించారు.
వైసీపీ హయాంలో రైతులకు కష్టమొస్తే ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేవాళ్లం అన్నారు జగన్. మొంథా తుఫాను కారణంగా ఏపీ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అన్నారు. ఊహించని రీతిలో రైతులకు నష్టం చేకూరింది అన్నారు.
15 లక్షల ఎకరాలలో దాదాపు 11 లక్షల ఎకరాల వరి పంట నష్టం జరిగింది అని తెలిపారు జగన్. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ఆర్బీకేల ద్వారా ఐదేళ్లు మీరు చేసింది చాలా మంచి పని.. అప్పట్లో ఉచిత పంటల బీమాతో పాటు ఆర్బీకేల ద్వారా మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు అన్నారు. మోంథా తుఫాన్ కారణంగా ఇప్పుడు పంట మొత్తం నాశనమైంది.. ప్రభుత్వం పరిహారం ఇవ్వట్లేదు అని జగన్తో కృష్ణా జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
