- Advertisement -

రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు!

- Advertisement -

రాయలసీమ బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, అవకాశం వచ్చిన ప్రతిసారి సీమ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీమకు ప్రాణాధారమైన నీటి ప్రాజెక్టులను తెలంగాణకు తాకట్టు పెట్టి, ఇక్కడి రైతులను నీటికోసం అల్లాడే పరిస్థితికి నెట్టారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును నమ్మిన పాపానికి రైతులు నిలువునా మునిగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, సీమను మళ్లీ ఎడారిగా మార్చాలనే కుట్ర జరుగుతోందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. నయవంచక పాలనలో సీమ ప్రజలకు తీరని ద్రోహం జరుగుతోందని, ఈ చారిత్రక ద్రోహానికి వ్యతిరేకంగా ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాగ్రహమే సాక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతోనే ‘ఛలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చామని అన్నారు. ఇది కేవలం ఆరంభమేనని, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి కోసం పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథక పనులను వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చల్లా మధు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కర్నూలు మేయర్ బీవీ రామయ్య తదితరులు పరిశీలించారు. సీమ హక్కుల కోసం తమ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -