- Advertisement -

భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి చంపేసింది!

- Advertisement -

రాజస్థాన్‌లో.. మేఘాలయ హనీమూన్ తరహా దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన మూడు నెలలకే భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య. రాజస్థాన్‌లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ మూడు నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజూ అనే మహిళను వివాహం చేసుకున్నారు ఆశిష్ అనే వ్యక్తి.

జనవరి 30వ తేదీన రాత్రి సమయంలో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆశిష్, అంజూలను గుర్తించి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే ఆశిష్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, అంజూను విచారించారు పోలీసులు.

కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక వాహనంలో వచ్చి తమను ఢీకొట్టి, నగలు లాక్కెళ్లారని పోలీసులకు తెలిపింది అంజూ. ఆమె చెప్పిన వివరాలకు ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో, పోలీసులు తమదైన రీతిలో విచారించగా అసలు నిజం బయటపెట్టింది ఆ మహిళ.

అంజూ పెళ్లికి ముందే సంజూ అనే యువకుడిని ప్రేమించిందని, వివాహం తర్వాత కూడా అతనితో ఫోన్లో మాట్లాడిందని, పుట్టింటికి వెళ్లినప్పుడే సంజూతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసిందని విచారణలో తెలుసుకున్నారు పోలీసులు. ప్లాన్ ప్రకారం అంజూ తన భర్తను ఒక నిర్మానుష్య రహదారిపై వాకింగ్‌కి తీసుకెళ్లగా, ఆశిష్‌పై దాడి చేసి హత్య చేశారు ఆమె ప్రియుడు, అతని స్నేహితులు.

దొంగతనం జరిగినట్లు నమ్మించడానికి అంజూ తన ఫోన్, చెవి కమ్మలను సంజూకి ఇచ్చి పంపించిందని, అనంతరం స్పృహ తప్పి పడిపోయినట్లు నటించిందని తెలిపారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -