- Advertisement -

హైడ్రా రంగనాథ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు

- Advertisement -

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నల్లచెరువు శిలాఫలకం వివాదం రాజకీయంగా వేడెక్కింది. ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ నేతలు…హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి నల్లచెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బండి రమేష్ పేరు పెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆరోపించారు.

ఈ ఘటనపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా శిలాఫలకాన్ని మార్చాలని, లేకపోతే తానే వెళ్లి కూల్చివేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, వెంటనే హైడ్రా కమిషనర్‌కు ఫోన్ చేసి వివరణ కోరారు. నల్లచెరువు శిలాఫలకం వ్యవహారంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, వెంటనే శిలాఫలకాన్ని మార్చాలని స్పీకర్ ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వాణి దేవి మరియు స్థానిక ఎమ్మెల్యే పేర్లతో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -