- Advertisement -

ఏపీ రాజధానిగా అమరావతి..రాజ్యసభ ఆమోదం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర రాజధాని అంశంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పరిణామం చోటుచేసుకుంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత కల్పించే ఈ బిల్లుకు పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ… ఇది చారిత్రాత్మకమైన మరియు నిర్ణయాత్మక ఘట్టం. అమరావతి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం రావడం ద్వారా ప్రజల ఆకాంక్షలు జాతీయ స్థాయిలో బలంగా వినిపించాయి అని పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్‌..ఈ పరిణామంపై ఆనందం వ్యక్తం చేస్తూ అమరావతికి పట్టిన గ్రహణం వీడింది అన్నారు.ప్రజారాజధానికి చట్టబద్ధత వచ్చింది అని వ్యాఖ్యానించారు. రాత్రి 7 గంటలకు ఇళ్ల ఎదుట దీపాలు వెలిగించాలని, దీపాలతో సెల్ఫీలు తీసుకుని #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -