ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP) తమ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత, పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పొలిటిబ్యూరోను పునర్వ్యవస్థీకరించింది. ఈ మార్పుల్లో భాగంగా యువ నాయకత్వానికి, అనుభవానికి సమ ప్రాధాన్యత కల్పించింది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పదోన్నతి పొందారు. ఆయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (Working President) నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడం.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగాన్ని నడిపించడం.భవిష్యత్తు ఎన్నికల వ్యూహరచనలో కీలక పాత్ర పోషించడం వంటి బాధ్యతలు లోకేశ్ చేపట్టనున్నారు.
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావును అదే పదవిలో కొనసాగిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడిగా, విశాఖ ఉక్కు పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన పల్లాపై చంద్రబాబు నాయుడు మరోసారి నమ్మకం ఉంచారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సమన్వయం చేయడంలో ఆయన పనితీరుకు ఈ పదవి గుర్తింపుగా భావిస్తున్నారు.
సామాజిక సమీకరణాలను (BC, SC, ST, మైనారిటీ) దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు కమిటీలలో ప్రాధాన్యం కల్పించినట్లు తెలుస్తోంది.
