- Advertisement -

బీహార్ మంత్రివర్గ విస్తరణ..ముహుర్తం ఫిక్స్!

- Advertisement -

బీహార్‌లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమైంది. మే 7న (గురువారం) పాట్నాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ విస్తరణలో కూటమిలోని పార్టీల మధ్య పదవుల పంపకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ విస్తరణలో ప్రధానంగా మూడు పార్టీలకు ప్రాధాన్యత లభించనుంది.బీజేపీ అత్యధికంగా 12 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చని సమాచారం.

జేడీయూ నితీష్ కుమార్ పార్టీకి 11 బెర్తులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పాత మంత్రుల్లో కొందరిని కొనసాగిస్తూనే, మరికొందరిని మార్చే అవకాశం ఉంది. ఎల్జేపీ ..చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని పార్టీకి 2 మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉంది.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మంత్రివర్గంలో యువతకు మరియు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్డీయే వ్యూహరచన చేస్తోంది.హోం, ఆర్థిక వంటి కీలక శాఖలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, బీజేపీ ఈసారి కీలక శాఖల కోసం పట్టుబట్టే అవకాశం ఉందని సమాచారం.

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేవలం కొద్దిమంది మంత్రులతోనే పాలన సాగుతోంది. పాలనను మరింత వేగవంతం చేయడానికి మరియు కూటమిలోని మిత్రపక్షాలను సంతృప్తి పరచడానికి ఈ విస్తరణ అనివార్యంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -