- Advertisement -

ఖైదీతో జైలర్ ప్రేమాయణం..బజరంగ్ దళ్ ఎంట్రీ!

- Advertisement -

హత్య కేసులో జైలులో ఉన్న ఖైదీతో మహిళా జైలర్ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. బెయిల్ మీద విడుదల అయ్యాక వివాహం చేసుకుంది ఈ ప్రేమజంట.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో 2007లో మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణ దత్ దీక్షిత్ హత్య కేసులో నిందితుడిగా నిరూపితమై జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి.

అనంతరం అదే జైల్లో అసిస్టెంట్ జైలరుగా వచ్చిన ఫిరోజా ఖాతున్ అనే మహిళా అధికారితో ప్రేమలో పడి, జైల్లోనే ప్రేమాయణం సాగించారు ధర్మేంద్ర సింగ్. 2022లో బెయిల్ మీద విడుదలయ్యాక కూడా ధర్మేంద్రను తరుచుగా కలుస్తూ, అతడినే పెళ్లి చేసుకుంటానని తన కుటుంబానికి తేల్చి చెప్పింది ఫిరోజా ఖాతున్.

పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా ధర్మేంద్రను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది మహిళా అధికారి. మహిళకు కన్యాదానం చేశారు బజరంగ్ దళ్ సభ్యులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -