- Advertisement -

సీమ‌లో రెడ్డి అ స్త్రం ప్ర‌యేగించిన బాబు…

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచె బాబు త‌న వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి ఇప్ప‌టినుంచె క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.ప్ర‌ధానంగా జ‌గ‌న్ ఎలా చెక్ పెట్టాల‌నేదానిమీద బాబు పోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. రెడ్డిసామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తున్నారు చంద్ర‌బాబు.

జ‌గ‌న్‌కు రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం మిన‌హా మిగిలిన మూడు జిల్లాల్లోను వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని స‌త్తా చాటింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీమ‌లో వైసీపీకి ఆధిప‌త్యానికి చెక్ పెట్టేందుకు చంద్ర‌బాబు చాప‌కింద నీరులా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌ధానంగా సీమ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో ప‌లువురు ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు టీడీపీలో జాయిన్ చేసుకున్నారు.

క‌డ‌ప‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత ఆదినారాయ‌న‌రెడ్డి , అఖిల‌ప్రియ‌కు, చిత్తూరు జిల్లాలో ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్నాథ్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇలా సీమలో జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికే ఏకంగా మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన బాబు ఇప్పుడు మ‌రో అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు.

తాజాగా గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండు ఎమ్మెల్సీల‌ను సైతం సీమకే కేటాయించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్‌, రామసుబ్బారెడ్డిలను ఖరారు చేస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆది,రామ‌సుబ్బారెడ్డి నేత‌ల మ‌ధ్య‌న ఉన్న విబేధాలు తొల‌గిపోయె అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఇద్ద‌రు క‌ల‌సిపోతే వైసీపీకి పెద్ద షాకె అని చెప్ప‌వ‌చ్చు.క‌డ‌ప ఎంపీ సీటునుకూడా కైవ‌సం చేసుకొనే అవ‌కాశాలు టీడీపీకి మెండుగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -