తొలి సినిమాతోనే యావత్ దేశాన్ని ఆకట్టుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తెలుగులో దగ్గుబాటి రానాతో కలిసి తీసిన ‘ఘాజీ’ సినిమా హిందీ, తమిళ్‌లో కూడా విడుదలై మంచి విజయం అందుకుంది. అందరీ ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంకల్ప్. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాకు పదింతల లాభం వచ్చింది. ఆ తర్వాత సంకల్ప్‌రెడ్డి మరే చిత్రం చేయలేదు. కొన్నాళ్లు విరామం తీసుకున్న సంకల్ప్‌రెడ్డి మరో విభిన్నమైన పాత్రతో వస్తున్నాడు. ఘాజీ సినిమా ఎలా ఉందో దానికి మించిన సినిమా తీయబోతున్నాడట. ఈసారి అంతరిక్షం నేపథ్యంలో తీయనున్నాడని సమాచారం.
కొంత విరామం తర్వాత తన రెండో సినిమాకు సంకల్ప్ సిద్ధమయ్యాడు. మెగా నటుడు వరుణ్ తేజ్ హీరోగా అతను కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. తొలి సినిమా ‘ఘాజీ’ తరహాలోనే ఇది కూడా వైవిధ్యమైన కథతో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రమే. అంతరిక్ష నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో ఒకటి రెండు మూడు వచ్చాయి. ఇప్పుడు అదే నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అంతరిక్షం నేపథ్యంలో తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.
అదే తరహాలో సంకల్ప్‌రెడ్డి పూర్తిస్థాయి స్పేస్ ఫిల్మ్ తీయబోతున్నాడట. రూ.25 కోట్ల పరిమిత బడ్జెట్లోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం. తొలి సినిమా ‘ఘాజీ’ రూ.15 కోట్ల పరిమిత బడ్జెట్లో తీశాడు. కానీ సినిమాలో క్వాలిటీ చూస్తే భారీగా ఖర్చు చేసినట్లుంటుంది. తొలి సినిమా తరహాలోనే పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా తక్కువ బడ్జెట్లో తీయడానికి ప్రణాళికలు రచించాడట.
ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇటీవల సినిమా గురించి వరుణ్‌తేజ్‌తో చర్చలు జరిపాడు. ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని సలహా ఇచ్చాడంట. దీంతో మెగా హీరో బ్యాంకాక్ గాని లేక అమెరికాగాని పయనమవ్వనున్నాడని సమాచారం.
