- Advertisement -

వరుస క్రేజీ ప్రాజెక్టులతో నిహారిక!

- Advertisement -

నిర్మాత, నటి నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం బరి. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా నిలవడం విశేషం.

ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా వాలీబాల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా పాన్-ఇండియా స్థాయిలో రూపొందనుంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, ఈ సినిమా సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుందని వెల్లడించారు.

పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇది ఒక కీలక చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. బరి సినిమా భారీ బడ్జెట్, బలమైన కథ, మంచి టీమ్‌తో రూపొందుతున్నందున ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం నిహారిక నిర్మించిన రాకాసా….ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఫాంటసీ కామెడీ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించగా, దర్శకురాలు మనసా శర్మ తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిహారిక తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించడం ఆసక్తిని పెంచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -