- Advertisement -
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. రాజా ది గ్రేట్‌తో హిట్ కొట్టిన రవితేజ , టచ్ చేసి చూడు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.తరువాత చేసే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టలని కసితో ‘నేల టిక్కెట్టు’తో వస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
రవితేజ మార్క్ ఎంటర్‌టైన్మెంట్ తో రూపొందించిన ఈ సినిమాతో మాళవిక శర్మ హీరోయిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.ఈ రోజు రిలీజ్ అయిన టజర్‌కు పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. రవితేజ మార్క్ ఈ టీజర్‌లో లేదు. ఏదో మిస్ అయిందనే భావన కలుగుతుంది.మరి సినిమా ఏవిధాంగా ఉంటుందో అనే భావన రవితేజ అభిమానులలో కలుగుతుంది.
