అలనాటి తార సావిత్రి జీవిత కథను మహనటి సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.గత వారం రీలిజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఈ చిత్రానికి అన్ని వర్గాల వారు ఫిదా అవుతున్నారు.అయితే ఇప్పుడు సంబంధించిన దీనికి కొన్ని ముఖ్యమైన పాత్రలు చూపించలేదనే వార్తలు వస్తున్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ దర్వకత్వంలో రూపొందించిన ఈ సినిమా నిడివి చాలా పెద్దది. దీంతో ఫైనల్ కట్లో తమకు కావల్సిన సినిమా ఉంచుకుని మిగత వాటిని కట్ చేశారు.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది.సావిత్రి భర్త శివాజీ గణేషన్ మొదటి భార్య పుష్పవల్లి పాత్రను కత్తిరించారు. ఆ పాత్ర పోషించిన నటి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహానటి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చిందని, తన పాత్రను సినిమా నుంచి తొలగించడం కొంచెం బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది.కేవలం తన పాత్రలేదనే బాధను తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ పెట్టానే తప్ప.. సినిమా యూనిట్‌పై తాను ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
