Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీ ఓ గ‌జినీ పార్టీ….ప‌వ‌న్‌

- Advertisement -

లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. టీడీపీ వ్యవహారశైలిని తప్పుబడుతూ ట్విట్టర్ ద్వారా జనసేనుడు విమర్శలు గుప్పించారు.

గజిని సినిమాలో హీరోలా టీడీపీ కన్వినియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్‌తో బాధపడుతోందంటూ జనసేనాని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే కేవలం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదని చేసే ప్ర‌తిప‌ని, మాట్లాడే ప్ర‌తి మాట‌…5 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉండాల‌న్నారు.

అవసరానికి అనుగుణంగా జనసేన వ్యవహరించదని, ఏది మంచో అది మాత్రమే చేస్తుందని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది ఎవరు? బీజేపీతో చేతులు కలిపింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఏం చేసిందనే విషయాన్ని టీడీపీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పారు. రానున్న రోజుల్లో మరోసారి మీరు మీ అవసరాలకు అనుగుణంగా మారబోమనే భరోసాను ఇవ్వగలరా? అని అన్నారు.

“ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’’ అని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారు. దీన్ని బట్టి టీడీపీ-బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తోందని పవన్ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -