జనసేన అధినేత,నటుడు పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(బుధవారం) ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.తన మూడో భార్య లెజెనోవా, పిల్లలతో కలసి చిరంజీవి ఇంటికి వెళ్లారు పవన్.గత కొన్ని రోజులుగా చిరంజీవి- పవన్ కల్యాణ్ మధ్య మాటాలు లేవనే వార్తలను బ్రేక్ చేస్తు పవన్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ రాకతో చిరు ఇల్లు మరింత సందడిగా మారింది. అన్నదమ్ములిద్దరూ ఒకే చోట చేరడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక అన్నదమ్ములిద్దరు కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించుకున్నారని తెలుస్తుంది.పవన్ చిరంజీవిని కలిసిన ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రామ చరణ్ భార్య ఉపాసన. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.ఇక నిన్న విడుదలైన సైరా మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.విడుదలైన 24 గంటలలోనే 11 మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది.
