- Advertisement -

జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన మాజీ డీజీపీ… బాబుతో స‌మావేశం…

- Advertisement -

వైఎస్ఆర్ పార్టీకీ మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు బిగ్ షాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం విశాఖ‌లో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను  ఆయ‌న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అయితే వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌లు సంచ‌ల‌నం క‌లిగించాయి. అయితే పార్టీలో చేర‌నున్న వార్త‌ల‌ను మాజీ డీజీపీ ఖండించారు.

జగన్ ను కలిసిన వెంటనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాంబ‌శివ‌రావు వైసీపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో జగన్, సాంబశివరావుల కలయికలపై రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జ‌గ‌న్‌కు షాక్ ఇస్తూ అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడును మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఇటీవలే ప్రతిపక్ష నేత జగన్ ను కలిసిన సాంబశివరావు వారం తిరగకముందే సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం మరో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.

వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలు బయటకు రాలేదు. వీరిరువురి భేటీపై మరింత సమాచారం వెలువడాల్సివుంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సీఎంతో భేటీ అయ్యారా లేదా వ్యక్తిగతంగా కలిశారా అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -