ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిని ప్రకటించారు. అభ్యర్ధిని ప్రకటించిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మెహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు నిరంతరం ప్రజా జీవితాలకు సంబంధించినవే అని అన్నారు.
వారితో నిత్యం ఉండే విజయ సాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్ధిగా అందుకే ప్రకటించానని జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు మనుషుల మధ్య సంబంధాలను విడదీయాలనుకుంటున్నారని, దీనికి డబ్బును ఎరగా వాడుతున్నారని అన్నారు. విజయ్ సాయి రెడ్డి కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారని, అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పాలని ఎంత మంది ఎన్ని వొత్తిళ్లు చేసినా ఆయన లొంగలేదని జగన్ చెప్పారు. విశ్వసనీయతకు మారుపేరైన విజయ సాయిరెడ్డిని అందుకే రాజ్యసభ సభ్యునిగా ప్రకటించానని జగన్ పేర్కొన్నారు.
