ఈసారి బిగ్ బాస్ 5 టూ…..మచ్..!

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ఆదివారం మొదలైయింది. 19 మంది కంటెస్టెంట్లను పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు హోస్ట్ నాగార్జున. ఆదివారం పరిచయం తో ముగిసిన బిగ్ బాస్ సోమవారం మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అనుకున్నట్టుగానే మొదటి రోజు ఎలిమినేషన్ పక్రియా మొదలైయింది.

అయితే ఈసారి బిగ్ బాస్ టెలికాస్ట రోజు రాత్రి 10గంటల నుంచి 11గంటల వరకు అంటే ఒక గంట. ఈ గంటలో 15నిమిషాల పాటు ప్రకటనలకు కేటాయించగా మిగిలిన సమయం 45 నిమిషాలు. ఇందులో ఒక్కో క కంటెస్టెంటుకును చూపాడానికి 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది.

నిన్న జరిగిన ఎలిమినేషన్ పక్రియాకే మొత్తం టైం కేటాయించారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అన్నటు ఉంది. మంది ఎక్కువ అవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్ తక్కువైనట్టు ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్ ఎలిమినేషన్ కు కారణం చెప్పినప్పుడు. అదెప్పుడు జరిగింది అంటు ప్రేక్షకులు ముక్కున వెలేసుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ చేయవలసింది ప్రక్షకులే కదా…! జరిగిన విషయం చూడకూండానే ఎలా ఓటింగ్ వెయాలి.

అందుకే ఈసారి కంటెస్టెంట్లు ఎక్కవ అవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్ కొన్నివారలవరకు తగ్గవచ్చు అని ప్రేక్షకులు బావిస్తున్నారు. అందుకే ఈసారి కంటెస్టెంట్లు టూ… మచ్ అంటున్నారు. ఈ వారం సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు.

Also Read: అందాన్ని మెరుగు పరిచే పండు..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -