రాధేశ్యామ్​ మరింత ఆలస్యం.. నిరాశలో ఫ్యాన్స్​..!

- Advertisement -

సాహో తర్వాత ఇప్పటివరకు ప్రభాస్​ సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్​ పాన్​ ఇండియా స్టార్​ అయిపోయాక.. సినిమాల విషయంలో చాలా కేర్​ తీసుకుంటున్నాడు. అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే సబ్జెక్ట్​ను ఎంచుకున్నాడు. అందులో భాగంగానే .. రాధేశ్యామ్​ అనే ఓ పీరియాడికల్​ డ్రామాలో ప్రభాస్​ నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.పీరియాడికల్, రొమాంటిక్​ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్​ ఆగిపోయింది. నిజానికి జూలై 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో ఆగిపోయింది.

మరోవైపు ఈ సినిమాలో వీఎఫ్​ఎక్స్​ , గ్రాఫిక్స్​ వర్క్​ చాలా వరకు పెండింగ్​లో ఉండిపోయింది. షూటింగ్​ పార్ట్​ మాత్రం ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్​ ఫ్యాన్స్​ ఎంతో ఎదురుచూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్​ డేట్​ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్​ ప్రకారం.. ఈ మూవీ విడుదల మరింత లేట్​ కావొచ్చట. మరోవైపు ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదల కావడం లేదు.థియేటర్​ యాజమానులకు, సినీ నిర్మాతలకు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఓటీటీ విషయంపై థియేటర్​ యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ పరిస్థితుల్లో రాధేశ్యామ్​ రిలీజ్​ మరింత ఆలస్యం అయ్యే చాన్స్​ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

Also Read

రాధేశ్యామ్​ రికార్డు.. ఏ ఇండియన్​ సినిమాకు దక్కని ఘనత

‘అహం బ్రహ్మాస్మి’ లో బాలీవుడ్​ అగ్రనటుడు..!

అమీర్​ భాయ్​ ఇదేంటి? నీతులు చెప్పడానికేనా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -