Thursday, April 25, 2024
- Advertisement -

కొత్త వాదన తెరపైకి తెచ్చిన హీరో సిద్ధార్థ్

- Advertisement -

పాన్ ఇండియా పదం ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉంది. దక్షిణాది నుంచి తెరకెక్కుతున్న చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ దక్కించుకుంటున్నాయి. సౌత్ నుంచి వచ్చిన మూవీస్ నార్త్ లో దుమ్మురేపుతుండటంతో పాన్ ఇండియా మూవీస్ గా పిలుస్తున్నారు. అయితే అసలు ఈ పదం సినిమాలను అగౌరవపర్చడమేనంటున్నాడు హీరో సిద్ధార్థ్.

ప్రాంతాల వారీగా సినిమాలను ఎందుకు వేరు చేసి చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. బాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలను అలా పిలవరనీ.. కేవలం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రాలను పాన్ ఇండియా మూవీస్ గా పిలుస్తుండటాన్ని సిద్ధార్థ్ తప్పుపట్టాడు. అన్ని సినిమాలనూ ఇండియన్ ఫిల్మ్స్ గా ఎందుకు పరిగణించకూడదన్నాడు.

ఒకప్పుడు మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాను భారత్ మొత్తం చూసిందనీ.. అప్పుడు పాన్ ఇండియా పదం లేదని గుర్తు చేశాడు. అన్ని సినిమాలను ఇండియన్స్ ఫిల్స్ అని పిలవాలనీ.. లేదంటే ఏ భాషలో తీస్తే ఆ భాషా చిత్రంగా పిలవాలన్నాడు. సిద్ధార్థ్ వ్యాఖ్యలతో కొత్త వాదన తెరపైకి వచ్చినట్లు అయ్యింది.

జాతీయ భాష పై కొత్త రచ్చకు తెరతీసేలా కంగనా కామెంట్స్

పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో

కుమార్తెకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన చిరు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -